ప్రేమ, శాంతి, క్షమాగుణం వంటి విలువల్ని అనుసరిద్దాం - కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు
యేసుక్రీస్తు తెలిపిన ప్రేమ, శాంతి, క్షమాగుణం వంటి విలువల్ని అనుసరిద్దామని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు క్రైస్తవ సోదరులకు పిలుపునిచ్చారు. ఏసుక్రీస్తు బోధించిన సమానత్వం, సోదరభావం వంటి విలువలు ఆచరిస్తూ ముందుకు వెళ్దామని అన్నారు. ప్రపంచ మానవాళికి అత్యుత్తమ జీవన మార్గాన్ని చూపించి, దైవ కుమారుడిగా ఆరాధించబడుతున్న ఏసు క్రీస్తు జన్మదినం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన కావలి పట్టణంలోని కచేరి మిట్టలో గల సధరన్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, వెంగళరావు నగర్ లోని అపోస్తులుల ఆశీర్వాద మందిరం, షాలేము క్రైస్తవ ప్రార్థన మందిరం, తుఫాన్ నగర్ లోని షారోను బాప్టిస్ట్ చర్చి, ఉదయగిరి బ్రిటి సమీపంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్, ఏబీఎన్ కాంపౌండ్ లోని జో లూయిస్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, కచేరి మిట్టలోని చర్చ్ ఆఫ్ క్రైస్ట్, తుఫాన్ నగర్ లోని క్రైస్తవ సంఘం, తదితర చర్చిలలో జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. కేకు ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సర్వ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన యుగకర్త యేసు క్రీస్తు జన్మదినం ప్రపంచానికి పండుగ దినమని అన్నారు. ప్రేమ మార్గంలో ఎవరి మనసునైనా జయించవచ్చునని తన జీవితం ద్వారా నిరూపించిన క్రీస్తు మార్గంలో నడుస్తూ సాటి మనిషికి మేలు చేయడమే మన ముందున్న కర్తవ్యమని తెలిపారు. ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలను అలవాటు చేసుకుని జీవితాన్ని శాంతిమయం చేసుకుందామన్నారు. సర్వ మానవాళికి మేలు కలగాలని ప్రభువును ప్రార్థిద్దామన్నారు.